బెంగళూరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు తిలక్‌నగర్ ఠాణా పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పేరుతో పలువురు పారిశ్రామికవేత్తలను నిర్మలా సీతారామన్ బెదిరించి బిజెపికి నిధులు వచ్చేలా చేశారంటూ … జనాధికార సంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యర్ గతంలో తిలక్‌నగర ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే పోలీసులు ఆ ఫిర్యాదును తీసుకోలేదు. దీంతో అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంతోశ్ గజానన హెగ్డే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించి, తదుపరి విచారణను అక్టోబరు 10కి వాయిదా వేశారు.