డిక్లరేషన్ పై ఇంతవరకు మాట్లాడని జగన్

డిక్లరేషన్ పై ఇంతవరకు మాట్లాడని జగన్

అమరావతి: వైసీపీ అధినేత జగన్ శుక్రవారం సాయంత్రం తిరుమలకు వెళుతున్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. క్రైస్తవుడైన జగన్ అన్యమతస్తుల మాదిరే శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందని ప్రకటించాలని చేయాలని స్వామీజీలు, హిందూ సంఘాలు, కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే ఆయనను శ్రీవారి దర్శనానికి పంపించాలని అంటున్నారు. టీటీడీ కూడా జగన్ కోసం డిక్లరేషన్ ఫామ్ ను రెడీ చేసినట్టు తెలుస్తోంది. జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లడానికి ముందే ఆయన బస చేసిన అతిథి గృహానికి వెళ్లి డిక్లరేషన్ ఫామ్ పై సంతకం తీసుకోవాలని టీటీడీ యోచిస్తున్నట్టు చెపుతున్నారు. డిక్లరేషన్ పై జగన్, వైసీపీ నేతలు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో, జగన్ డిక్లరేషన్ ఇస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos