పాలస్తీనాకు సంఘీభావంగా ‘నొగుచి’ అవార్డును తిరస్కరించిన ఝంపాలహరి

పాలస్తీనాకు సంఘీభావంగా ‘నొగుచి’ అవార్డును తిరస్కరించిన ఝంపాలహరి

న్యూయార్క్‌ : న్యూయార్క్‌ నగరంలోని నొగుచి మ్యూజియం నుండి అవార్డు తీసుకోవడానికి పులిట్జర్‌ బహుమతి గ్రహీత, రచయిత్రి ఝుంపా లహిరి తిరస్కరించారు. పాలస్తీనాకు సంఘీభావ చిహ్నమైన కెఫియె తలపాగాను ధరించినందుకు ముగ్గురు ఉద్యోగులను విధుల నుండి తొలగించినందుకు నిరసనగా ఈ చర్య తీసుకున్నారు. సవరించిన తమ డ్రెస్‌ కోడ్‌ విధానానికి అనుగుణంగా తాము తీసుకున్న చర్యపై నిరసన వ్యక్తం చేస్తూ 2024 ఇసాము నొగుచి అవార్డును స్వీకరించడానికి ఝుంపా లహిరి తిరస్కరించారని మ్యూజియం ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తున్నామని, తమ ఈ విధానం ప్రతి ఒక్కరి అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చని ఆ ప్రకటన పేర్కొంది. న్యూయార్క్‌ టైమ్స్‌ మొదటగా ఈ వార్తను ఇచ్చింది. పాలస్తీనా స్వయం నిర్ణయాధికారానికి చిహ్నమైన నలుపు తెలుపు రంగులతో కూడిన తలపాగా కెఫియెను ప్రపంచవ్యాప్తంగా నిరసనకారులందరూ ధరిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos