ప్రియాంక గాంధీకి కార్యాలయం

ప్రియాంక గాంధీకి కార్యాలయం

న్యూఢిల్లీ : ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఓ సమావేశ మందిరాన్ని కేటాయించారు. ఆమెను తూర్పు ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించిన సంగతి తెలిసిందే. గతంలో రాహుల్ గాంధీ ఉపయోగించిన సమావేశ మందిరాన్నే ప్రస్తుతం ప్రియాంక గాంధీకి కేటాయించారు. ప్రియాంక గాంధీ వాద్రా అని హిందీ, ఇంగ్లిష్‌లలో రాసిన నామ ఫలకాలను అతికించారు. దీనికి పక్కనే రాహుల్ గాంధీ సమావేశ మందిరం ఉంది. ప్రియాంక గాంధీ కుంభమేళాలో పాల్గొన్న అనంతరం పదవీ బాధ్యతలను చేపడతారు. ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ఆమె కృఫి చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా ప్రియాంక గాందీ కోసం లక్నోలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని ఆధునికీకరిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos