మమత బెనర్జీకి ఎదురు దెబ్బ

మమత బెనర్జీకి ఎదురు దెబ్బ

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ శారదా చిట్స్ కుంభకోణం  కేసులో మంగళవారం నాడు సుప్రీంకోర్టులో వాడీవేడీగా వాదనలు కొనసాగాయి. ఈ కేసు విషయమై కోల్‌కత్తా సీపీని సీబీఐ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ కమిషనర్ సీబీఐ విచారణకు హాజరైతే వచ్చిన ఇబ్బందులేమిటని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.శారదా కుంభకోణం కేసులో విచారణకు వచ్చిన  సీబీఐ అధికారులకు బెంగాల్ ప్రభుత్వం నుండి  ఆదివారం నాడు సహాయ నిరాకరణ ఎదురైంది. ఈ విషయమై బెంగాల్ సీపీని అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని మమత బెనర్జీ ఆరోపణలు చేశారు.సీబీఐ తీరును నిరసిస్తూ ఆదివారం రాత్రి నుండి ఆమె కోల్‌కత్తాలో దీక్ష చేపట్టారు.  ఇదిలా ఉంటే  శారదా స్కామ్‌లో  సీపీ ఆధారాలను మార్చారని సీబీఐ  కోల్‌కత్తా సీపీపై ఆరోపణలు చేసింది.ఈ విషయమై  సుప్రీంకోర్టులో కూడ అఫిడవిట్ దాఖలు చేసింది.సీబీఐ విచారణకు కోల్‌కత్తా సీపీ రాజీవ్ కుమార్ హాజరుకావాలని  సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  సీబీఐ విచారణకు సీపీ రాజీవ్ కుమార్  హాజరైతే తప్పేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.కేసు విచారణ ప్రారంభమైన వెంటనే రెండు వర్గాలకు చెందిన న్యాయవాదులు తమ తమ వాదనలను విన్పించారు.కోల్‌కత్తా సీపీని అరెస్ట్ చేయకూడదని కూడ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్ ఘటనపై సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదికను అందించింది.మమత బెనర్జీ కూడ విచారణకు రావాలని సుప్రీంలో ఏజీ వాదించారు.


ఇది మా నైతిక విజయం 

సుప్రీంకోర్టు తీర్పుపై మమతాబెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. తీర్పును నైతిక విజయంగా అభివర్ణించారు. .‘ఇది మా నైతిక విజయం. న్యాయవ్యవస్థ, ఇతర సంస్థల పట్ల మాకు అపార గౌరవం ఉంది. కోర్టు తీర్పును మేం అనుసరిస్తాం. దర్యాప్తునకు అందుబాటులో లేనని రాజీవ్‌ కుమార్ ఎప్పుడూ చెప్పలేదు. కేసు విచారణకు అందుబాటులో ఉన్నానని పేర్కొంటూ రాజీవ్‌ కుమార్‌ సీబీఐకి పలుమార్లు లేఖ రాశారు. కానీ వారేం చేశారు? సరాసరి ఆయన ఇంటికి వెళ్లి అరెస్టు చేయాలని చూశారు’ అని సీబీఐని దుయ్యబట్టారు.

ధర్నాపై నిర్ణయం తీసుకోలేదు..

ధర్నాను విరమించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మమతాబెనర్జీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ప్రతిపక్ష నేతలు నేడు కోల్‌కతాకు వస్తున్నారని, వారితో సంప్రదించిన తర్వాతే ధర్నాపై ఓ నిర్ణయం తీసుకుంటామని దీదీ స్పష్టం చేశారు

.ప్రధాని పీఠం కోసమే మమత దీక్ష: జైట్లీ విమర్శలు

సీబీఐకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేపట్టిన ధర్నాపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్ల ఫైరయ్యారు. అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన దీదీని విమర్శించారు.సీబీఐ విషయంలో మమత ఓవరాక్షన్ అనేక అనుమానాలను కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ చర్య వెనుక మమత వ్యూహమేంటో..? ధర్నాకు విపక్షనేతలను పిలవడం వెనుక అర్థమెంటోనని జైట్లీ ప్రశ్నించారు.కేవలం పోలీస్ అధికారికి అండగా ఉండేందుకే మమత ధర్నా చేపట్టారనుకుంటే అది పోరపాటేనని.. దీని వెనుక ఆమె ఉద్దేశ్యంత తనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకునేందుకని జైట్లీ ఆరోపించారు. మమతకు చాలా మంది ప్రతిపక్షల నేతలు మద్ధతు పలికారు.వారిలో చాలా మంది అవినీతి ఆరోపణల కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న వారేనని మండిపడ్డారు. అవినీతి పాలకులంతా ఏకమై దేశాన్ని పాలించాలని ఎత్తుగడలు వేస్తున్నారని జైట్లీ అభిప్రాయపడ్డారు. సిద్ధాంతాలు లేని సంకీర్ణాల వల్ల దేశ భవిష్యత్‌కు విపత్తు అని ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos