ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు

ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు

అమరావతి: ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు నిపుణుల పర్యవేక్షణలో గురువారం మరమ్మతులు చేస్తున్నారు. బ్యారేజ్ 67, 68, 69 నెంబర్ గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు. ఇటీవల బ్యారేజ్ 69వ గేటు వద్ద పడవ ఢీకొని కౌంటర్ వెయిట్ దెబ్బతింది. ఇంజినీరింగ్ నిపుణుడు, ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ సిబ్బంది పనులు చేపట్టింది.ఇటీవల ప్రకాశం బ్యారేజికి చేరిన వరద ఉదృతికి నాలుగు పడవలు(బోట్లు) వచ్చి అడ్డుతగిలిన విషయం తెలిసిందే. దానిలో ఒకటి కౌంటర్ వెయిట్ను ఢీకొనడంతో విరిగిపోయింది. 67, 68, 69 గేట్లకు రెండు బోట్లు అడ్డుగా ఉండటంతో ఆ గేట్ల నుంచి దిగువకు నీటి ప్రవాహం సక్రమంగా లేదు. బ్యారేజీలో ఇరుక్కున్న పడవలను బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ సిబ్బంది తొలగిస్తోంది. తొలుత 67, 69 గేట్లు మూసి ఆ తర్వాత పడవలను తొలగించనున్నారు. ఏడు రోజుల్లో బ్యారేజీ గేట్ల ఏర్పాటు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos