భద్రతా లోపాలకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత.. దోడా ఉగ్రదాడి ఘటనపై రాహుల్‌

భద్రతా లోపాలకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత.. దోడా ఉగ్రదాడి ఘటనపై రాహుల్‌

న్యూ ఢిల్లీ: జమ్ము కశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. భారత సైన్యంపై ఉగ్రదాడులు పెరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉగ్రదాడిలో అమరులైన సైనికులకు నివాళులర్పించిన రాహుల్.. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘ఈరోజు జమ్మూకశ్మీర్లో జరిగిన మరో ఉగ్రవాద ఎన్కౌంటర్లో మన సైనికులు వీరమరణం పొందారు. అమరవీరులకు నా నివాళి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గత కొన్ని నెలలుగా జమ్మూకశ్మీర్లో భారత సైనికులపై ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. బీజేపీ తప్పుడు విధానాలే ఈ పరిస్థితికి కారణం. పదే పదే భద్రతా లోపాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ఇది ప్రతి దేశభక్తిగల భారతీయుడి డిమాండ్. ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి’ అని రాహుల్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos