హైదరాబాద్: బంగాళాఖాతంలో ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో APలో 5 రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు, మిగతా 4 రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. తెలంగాణాలోనూ రాబోయే 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.