భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ను రెండు రోజుల కిందట తెరచిన విషయం తెలిసిందే. లోపలి గదిని డూప్లికేట్ కీస్తో ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ డూప్లికేట్ తాళం చెవిలతో ఆ ఇన్నర్ ఛాంబర్ ఓపెన్ కాలేదు. డూప్లికేట్ కీస్తో ఎందుకు ఆ గది తెరుచుకోలేదో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టనున్నట్లు ఒడిశా సర్కార్ తెలిపింది. 12వ శతాబ్ధానికిచెందిన జగన్నాథ ఆలయం రత్న భండార్ను జూలై 14వ తేదీన తెరిచిన విషయం తెలిసిందే.