లఖ్ నవూ: ఉత్తరప్రదేశ్ లో బుధవారం ఒక్కరోజే పిడుగుపాటుకు ఏకంగా 30 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా ప్రతాప్‌గఢ్ లో 11 మంది ప్రాణాలు కోల్పోగా సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌పురిలో ఐదుగురు, ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మరణించారు. అనేక మంది ప్రజలు పిడుగుపాటుకు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు.