ఒక్క నెలలో 7 కేజీలు తగ్గా, తీవ్ర అనారోగ్య సమస్య ఉండొచ్చు

ఒక్క నెలలో 7 కేజీలు తగ్గా, తీవ్ర అనారోగ్య సమస్య ఉండొచ్చు

భటిండా: తాను బరువు తగ్గడంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తీకరించారు. పంజాబ్లోని భటిండాలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నేను చాలా బరువు తగ్గాను. ఓ వ్యక్తి ఎటువంటి కారణం లేకుండా ఒక నెలలో 7 కిలోల బరువు తగ్గితే.. అది చాలా తీవ్రమైన సమస్య. కాబట్టి వైద్యులు నాకు అనేక పరీక్షలు సూచించారు. ఇందుకోసం నా మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పెడిగించాలని సుప్రీంకోర్టును కోరాను. వారంలో నేను అన్ని వైద్య పరీక్షల్ని పూర్తి చేయాలి. ఏదైనా తీవ్రమైన వ్యాధి ఉంటే వైద్య పరీక్షల్లో బయటపడుతుంది’ అని కేజ్రీవాల్ వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos