శ్రీహరికోట: ఇక్కడ మంగళవారం జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు వాయిదా వేశారు. దీంతో నాలుగోసారీ రాకెట్ ప్రయోగం వాయిదాపడినట్లయింది. చెన్నైకి చెందిన అంకుర పరిశ్రమ అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ అగ్నిబాణ్ సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్ (సార్టెడ్) రాకెట్ ప్రతిష్ఠత్మాకంగా రూపొందించింది. సొంత లాంచ్‌ప్యాడ్ ఏర్పాటు చేసి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉప గ్రహాన్ని ప్రవేశపెట్టాలనుకున్నది. షెడ్యూల్ ప్రకారం 8 గంటల కౌంట్‌డౌన్ అనంతరం మంగళవారం ఉదయం 5.48 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ఇస్సో వర్గాలు తెలిపాయి.