న్యూ ఢిల్లీ: ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు నాలుగు రోజులు అటుఇటుగా మే 31న కేరళను తాకనున్నాయని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. రుతుపవనాలు మే 1న కేరళను తాకడం ముందస్తు కాదని, సాధారణ వేళకు సమీపంగా ఉందన్నారు. గత 150 ఏళ్లలో కేరళలో రుతుపవనాల ప్రారంభ తేదీలు మారుతూ వస్తున్నాయి. 1918లో చాలా త్వరగా మే 11నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఇక అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18న రాష్ట్రాన్ని రుతుపవనాలు తాకాయి. ఇక గతేడాది జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకినట్టుగా డేటా స్పష్టం చేస్తోంది.