ఇండియాలో కొత్త కోవిడ్ వేరియంట్‌

ఇండియాలో కొత్త కోవిడ్ వేరియంట్‌

న్యూఢిల్లీ: భారత్లో కొత్త కోవిడ్ వేరియంట్లు-కేపీ.2, కేపీ1.1, ఎఫ్ఎల్ఐఆర్టీ ప్రబలుతున్నాయి. జేఎన్.1 వేరియంట్ నుంచి ఈ కొత్త వేరియంట్ల మ్యుటేషన్ అయినట్లు తెలుస్తోంది. కేపీ.2 వేరియంట్ అమెరికా, కెనడా దేశాల్లో కేపీ.2 వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. మహారాష్ట్రలోనే కేపీ.2కు చెందిన 91 కొత్త కేసులను గుర్తించారు. కర్నాటకలో కూడా ఈ కేసుల వల్ల ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. జనవరిలో తొలిసారి ఈ కేసుకు చెందిన ఆనవాళ్లు గుర్తించారు. థానే, సోలాపూర్, పూణె, అమరావతి, నాసిక్, అహ్మద్నగర్, ఔరంగబాద్, లాతూర్, సంఘ్లియోన్ పట్టణాల్లో ఈ కేసులను పసికట్టారు. కోవిడ్ కేసుల్లో కేపీ.1 వల్ల 28 శాతం కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇమ్యూనిటీ నుంచి తప్పించుకోవడంలో జేఎన్.1తో పోలిస్తే కేపీ.2 ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. దాని వల్లే ఈ వేరియంట్ తో ఎక్కువ ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కూడా కేపీ.2 వేరియంట్ సోకే ప్రమాదం ఉందని కొలంబియా యూనివర్సిటీ వైరాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ హో తెలిపారు. ఫ్లిర్ట్ వేరియంట్ వల్ల గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, ముక్కు కారడం, తల-ఒళ్లునొప్పులు, ఛాతి పట్టేయడం, శ్వాససరిగా తీసుకోలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos