న్యూఢిల్లీ : ఈ కాలంలో రాముడు ఉండి ఉంటే ఈడీ వంటి దర్యాప్తు సంస్ధలతో వేధించి ఆయన్ను కూడా బీజేపీలో చేరాలని ఒత్తిడి చేసేవారని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాషాయ పార్టీపై విమర్శలు చేశారు.కాషాయ పార్టీలో చేరాలని, లేకుంటే జైలులో ఉంటారని రాముడినీ ఒత్తిడి చేసేవారని బీజేపీని దుయ్యబట్టారు.కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసిన నేపధ్యంలో ఆయన పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈడీ సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోని విషయం తెలిసిందే. ఆప్ సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తే బీజేపీ ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలతో విపక్ష ప్రభుత్వాలను వేధించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.