రైతు సంఘాలతో కేంద్రం మూడోరౌండ్‌ చర్చలు విఫలం

రైతు సంఘాలతో కేంద్రం మూడోరౌండ్‌ చర్చలు విఫలం

న్యూ ఢిల్లీ: రైతు సంఘాల నేతలతో చండీగఢ్లో కేంద్రమంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటి వరకు మూడు దఫాలుగా చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం దొరకలేదు. సమావేశంలో హర్యానా ప్రభుత్వం, పోలీసుల చర్యలపై రైతు సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎంఎస్పీకి చట్టపరంగా హామీ, ఇతర డిమాండ్లపై చర్చించారు. అలాగే, లఖింపూర్ ఖేరి ఘటనతో సహా ఇతర డిమాండ్లపై రైతు నేతలతో ఏకీభవించినట్లు సమాచారం. భేటీలో ఎంఎస్పీ చట్టబద్ధమైన హామీ అమలులో తలెత్తే సమస్యలపై కేంద్రమంత్రులు రైతు సంఘాలకు వివరించారు. అయితే, ఇందులో వెనక్కి తగ్గేది లేదని రైతుసంఘాల నేతలు భీష్మించారు. డిమాండ్లపై మరోసారి ఆదివారం సాయంత్రం 6 గంటలకు చర్చలు జరుగనున్నాయి. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ రైతుసంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు. రైతు సంఘాలు లేవనెత్తిన సమస్యలపై దృష్టి సారించి, పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos