బీజేపీ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు

బీజేపీ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు

థానే : పోలీస్ స్టేషన్లోనే శివసేన నాయకుడిపై కాల్పులకు దిగిన మహారాష్ట్రలోని బిజెపి ఎమ్మెల్యే గణ్పత్ గైక్వాడ్పై ఎస్సి, ఎస్టి (వేధింపులు నిరోధక) చట్టం కింద కేసు నమోదయింది. ద్వార్లి గ్రామానికి చెందిన ఒక గ్రామస్థుడు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, మరో ఏడుగురిపై థానే జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదయింది. ఆదివారం ఈ విషయాన్ని పోలీసు అధికారులు వెల్లడించారు. ఒక భూమి యజమానరాలు అయిన మహిళపై కులపరమైన వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పారు. జిల్లాలోని హిల్ లైన్ పోలీస్ స్టేసన్లోని సీనియర్ ఇస్పెక్టర్ క్యాబిన్లోనే శుక్రవారం రాత్రి శివసేన నాయకుడు మహేష్ గైక్వాడ్పై కళ్యాణ్ తూర్పు నియోజకవర ఎమ్మెల్యే ఆరు బుల్లెట్లతో కాల్పులకు తెగించాడు. దీంతో మహేష్ గైక్వాడ్, అతని సహచరుడు రాహుల్ పాటిల్ గాయపడ్డారు. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై హత్యయత్నం, ఇతర అభియోగాలతో ఎమ్మెల్యేపై కేసు నమోదయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos