రాంచీ: జార్ఖండ్‌లోని కాంగ్రెస్, జేఎంఎం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ పయనం అయ్యారు. రాంచీ నుంచి వాళ్లు హైదరాబాద్‌కు వస్తున్నారు. అసెంబ్లీలో తమ శక్తి చూపిస్తామని ఎమ్మెల్యే బన్నా గుప్తా అన్నారు. అయితే రాంచీ విమానాశ్రయంలో జేఎంఎం ఎమ్మెల్యే హఫిజుల్ హసన్‌ను మీడియా ప్రశ్నించింది. ఎక్కడకు వెళ్తున్నారని ఆయన్ను అడిగారు. దానికి ఆయన బదులిస్తూ హైదరాబాద్ వెళ్తున్నామని, బిర్యానీ తినేందుకు వెళ్తున్నట్లు ఆ ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. మరో వైపు ఇవాళ జేఎంఎం పార్టీకి చెందిన చంపై సోరెన్ ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. హేమంత్ సోరెన్‌ను 5 రోజుల పాటు కస్టడీలోకి ఈడీ తీసుకున్నది. బుధవారం రాత్రి ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అయిదు రోజుల పాటు జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. సుమారు 600 కోట్ల భూ కుంభకోణంలో హేమంత్ సోరెన్ పాత్ర ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తున్నది.