ఏపీ భవన్ వద్ద ఉద్రిక్తత

ఏపీ భవన్ వద్ద ఉద్రిక్తత

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నాకు సిద్ధమయ్యారు. ఇందుకు ఏపీ భవన్లో కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. ఆ ఏర్పాట్లను ఏపీ భవన్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ధర్నా చేయడం కుదరదని వెల్లడించారు. దీంతో అధికారులతో ఏపీ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ భవన్ వద్ద ధర్నా చేయాలని షర్మిల నిర్ణయించారు. షర్మిలతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ధర్నాలో పాల్గొననున్నారు. అయితే ఏపీ భవన్ సిబ్బంది తీరుతో షర్మిల ధర్నాపై ఉత్కంఠ నెలకొంది.
వివిధ పార్టీల నేతలను కలిసి…
కాగా.. ఏపీకి స్పెషల్ స్టేషన్ కోరుతూ ఢిల్లీ గడ్డ మీద ధర్నాకు షర్మిల పూనుకున్నారు. పలు పార్టీల నేతలను కలిసి ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. శుక్రవారం ఉదయం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్తో భేటీ అయ్యారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు డీఎంకే ఎంపీ తిరుచి శివను.. మధ్యాహ్నం 12 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో షర్మిల సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇవ్వాలని ఆయా నేతలను షర్మిల కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos