తోపుడు బండిపై భార్య మృతదేహాన్ని తీసుకెళ్లిన భర్త

తోపుడు బండిపై భార్య మృతదేహాన్ని తీసుకెళ్లిన భర్త

ఫిరోజాబాద్: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో దయనీయ ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో మరణించిన ఓ మహిళ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ లభ్యం కాలేదు. దాంతో ఆమె భర్త తోపుడుబండిపై మృత దేహాన్ని తీసుకెళ్లాడు. ఎటా జిల్లాలోని అస్రౌలి గ్రామానికి చెందిన వేద్రామ్ భార్య మోహర్కు సోమవారం గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం ఆమెను ఫిరోజాబాద్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలోని ట్రామా కేంద్రంలో చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మరణించింది. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అంబులెన్సు కావాలని ఆమె భర్త కోరాడు. గంటల కొద్ది వేచి ఉన్నా ఎవరూ తన గోడు వినిపించుకోక పోవడంతో చివరకు తోపుడుబండిపై ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లాడు. స్థానికులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి వైరల్ చేయడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ జైన్ విచారణకు ఆదేశించారు. తాము వేరే జిల్లాకు చెందిన వాళ్లం కాబట్టి అంబులెన్సు ఇవ్వడం కుదరదని వైద్యులు చెప్పినట్లు మృతురాలి భర్త తెలిపాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos