రాంచీ : జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో జార్ఖండ్ జన్ ముక్తి మోర్చాకు సంబంధించిన మావోయిస్టులు , పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో రంక పీఎస్ ఇంచార్జి శంకర్ ప్రసాద్ కుష్వాహాకి తూటా గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను రాంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో రంక పోలీసు స్టేషన్ పరిధిలోని డెంగురా గ్రామం వద్ద పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. శంకర్ ప్రసాద్ కుడి చేతికి తీవ్ర గాయమైందని జిల్లా ఎస్పీ దీపక్ కుమార్ పాండే తెలిపారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల కోసం బలగాలు గాలిస్తున్నారు.