బాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చలు సంతృప్తి కరం

బాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చలు సంతృప్తి కరం

హైదరాబాదు: ‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య ఆదివారం నగరంలో గంటన్నర సేపుకు పైగా చర్చలు జరిగాయి. అవి సంతృప్తికరంగా సాగాయ’ని జనసేన నేత నాదేండ్ల మనోహర్ సోమవారం ఇక్కడ చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు జరిగాయన్నారు. ఇంతకుముందు పలుమార్లు చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళితే చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ ఇంటికి తొలిసారి చంద్రబాబు చర్చకు రావడం ఆసక్తి కర పరిణామం. ఏపీలో వైఎస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ వెళుతుందా? లేదా? అన్నది మున్ముందు తేలుతుందని చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos