వెల్లింగ్టన్: భారత్‌తో జరిగే మూడు టీ-20ల సిరీస్‌కి ముందు న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు సీనియర్ ఆటగాడు, ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ గాయం కారణంగా దూరమయ్యాడు. వెస్ట్‌ప్యాక్ స్టేడియం వేదికగా జరిగిన ఐదో వన్డేలో కూడా గుప్టిల్ పాల్గొనలేదు. అతని స్థానంలో జేమ్స్ నీశమ్‌ని జట్టులోకి తీసుకున్నారు. గుప్టిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో నీశమ్‌ని టీ-20 సిరీస్‌లోనూ కొనసాగించనున్నారు. ‘‘దురదృష్టవశాత్తు మార్టిన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అతను జట్టులో లేకపోవడం మాకు లోటే.. కానీ అతను గాయం నుంచి కోలుకోవడం మాకు ముఖ్యం. వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేసిన జేమ్స్ నీశమ్‌ని జట్టులోకి తీసుకుంటున్నాం. అతను జట్టులోకి రావడం ద్వారా మాకు బలం చేకూరుతుంది’’ అని కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపారు. కాగా భారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-4 తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దాదాపు 10 సంవత్సరాల తర్వాత భారత్ న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్‌ని కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌లో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించిన న్యూజిలాండ్ టీ-20 సిరీస్‌ని దక్కించుకొని పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.