పంచాయతీ కార్యదర్శి చేతివాటం..పింఛన్ల సొమ్ముతో పరారీ

పంచాయతీ కార్యదర్శి చేతివాటం..పింఛన్ల సొమ్ముతో పరారీ

సత్యవేడు : చిత్తూరు జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి చేతివాటం ప్రదర్శించాడు. భారీ మొత్తంలో పింఛన్ల సొమ్మును కాజేసి పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యవేడు మండలంలోని పంచాయతీ కార్యదర్శి నాగరాజు.. సిరణంబూదూరు, కదిరివేడుపాడు గ్రామ పంచాయతీలలో పంపిణీ చేయాల్సిన సామాజిక పింఛన్ల మొత్తం రూ.11 లక్షలను తీసుకొని ఉడాయించాడు. సంబంధిత ఎంపీడీవో జ్ఞానేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వటంతో స్పందించిన పాలనాధికారి ప్రద్యుమ్న పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేసి మరో అధికారిని నియమించారు. నాగరాజు స్వస్థలం శ్రీకాళహస్తి మండలం పాన‌గల్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఏర్పేడులో అతను ఇలాంటి సంఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. పారిపోయిన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos