కోల్‌కత్తా: శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ విషయంలో సీబీఐ ప్రవర్తించిన తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ధర్నా చేస్తున్నప్పటికీ ఆమె పాలనను మాత్రం మరువలేదు. సీఎంగా తాను రోజూ నిర్వర్తించే విధులను ధర్నా వేదికపై నుంచే చక్కబెట్టారు. అధికారులు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తూ పాలనాపరమైన విధులను మరువకుండా మమతా బెనర్జీ వ్యవహరించారు. ఇదిలా ఉంటే.. ‘సేవ్ ది కాన్‌స్టిట్యూషన్’ అంటూ ఆమె చేస్తున్న ధర్నాకు ప్రతిపక్షాల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆమెకు మద్దతు తెలిపారు.