విశాఖ ఉక్కును చౌకగా అమ్మేందుకు మోదీ యత్నం

విశాఖ ఉక్కును చౌకగా అమ్మేందుకు మోదీ యత్నం

కడప: విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ మాధ్యమాలతో మాట్లాడారు. కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కుపరిశ్రమ స్థాపించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి, వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ ఉక్కు పరిశ్రమను తనకు నచ్చిన వ్యక్తులకు చౌకగా అప్పజెప్పేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలో పరిస్థితులు ఆందోళన కారణంగా ఉన్నాయన్నారు. ఢిల్లీలో పత్రికలపై దాడులు, సీబీఐ లాంటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. బ్యాక్ డోర్ విధానంతో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల సంఘాలను ప్రమాదంలో నెడుతున్నారన్నారు. న్యాయవ్యవస్థను కూడా తప్పు దారి పట్టిస్తున్నారని విమర్శించారు. పోలవరం కోసం ఆరు వేలకోట్లు ఖర్చుచేశారన్నారు. పదేళ్లు అయినా ప్రభుత్వాలు పూర్తి చేయలేదని పల్లంరాజు విమర్శలు గుప్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos