రావణుడిగా రాహుల్‌, అతిపెద్ద అబద్ధాలకోరు మోదీ

రావణుడిగా రాహుల్‌, అతిపెద్ద అబద్ధాలకోరు మోదీ

న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్నది. అయినా పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతున్నది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీటెక్కిస్తున్నారు. అధికార విపక్షాలైన బీజేపీ , కాంగ్రెస్ మధ్య సామాజిక మాధ్యమాల్లోనూ పచ్చగడ్డివేస్తే భగ్గుమంటున్నది. ఇరుపార్టీల మధ్య ప్రస్తుతం పోస్టర్ వార్ కొనసాగుతున్నది. ప్రధాని మోదీని ఫొటోతో అతిపెద్ద అబద్ధాలకోరు ఎవరు? అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో కాంగ్రెస్ పార్టీ ఓ పోస్టర్ను విడుదల చేసింది. అదేవిధంగా బీజేపీ సమర్పిస్తున్న పీఎం నరేంద్ర మోదీ యాస్ జుమ్లా బాయ్ అంటూ మరో పోస్టర్ను ట్వీట్ చేసింది. అయితే దీనికి ప్రతిగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ .. పది తలల రావణుడి రూపంలో ఉన్న పోస్టర్ను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ హాండిల్లో ట్వీట్ చేసింది. దీనిపై పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడి పట్ల హింసను ప్రేరేపించేదిగా ఉందని విమర్శించారు. కాగా, రాజకీయాలను ఏ స్థాయికి తీసుకుపోవాలనుకుంటున్నారంటూ ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిలదీశారు. మీ పార్టీ అధికారిక ట్విట్టర్ హాండిల్లో పోస్టు చేస్తున్న హింసాత్మక, రెచ్చగొట్టేలా ఉన్న ట్వీట్లను మీరు అంగీకరిస్తారా అంటూ ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos