హైదరాబాదు : ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ్ ముఖానికి గాయాలైనట్టు సమాచారం. ఎస్.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ షూటింగ్ ప్రారంభానికి ముందు ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చరణ్ కు ప్రాథమిక చికిత్స అందించారు. వెంటనే షూటింగ్ ప్రారంభించడానికి అనుకూలంగా లేకపోవడంతో, పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలిసింది. దీంతో ఆయన నటించాల్సిన గేమ్ చేంజర్ సినిమా తదుపరి చిత్రీకరణ కొన్ని రోజుల పాటు వాయిదా పడక తప్పలేదు.