నీట మునిగిన నాగ్‌పూర్‌

నీట మునిగిన నాగ్‌పూర్‌

నాగపూర్: భారీ వర్షానికి నాగ్పూర్ నీట మునిగింది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అర్ధరాత్రి నుంచి ఉదయం 5.30 గంటల వరకు ఏకంగా 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరింది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అంబజారి సరస్సు పొంగిపొర్లుతోంది. వరద సహాయక చర్యల కోసం నగరంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు మోహరించారు. వరదల్లో చిక్కుకుపోయిన 25 మందిని ఇప్పటి వరకు రక్షించారు. అత్యవసర పనులుంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు.నాగ్పూర్, భండారా, గోండియా, వార్ధా, చంద్రపూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, అమరావతి, యవత్మాల్, గడ్చిరోలిలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos