సోనియాతో షర్మిల భేటీ

న్యూఢిల్లీ: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల, కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీతో గురువారం ఉదయం ఢిల్లీలో జరిగిన సమావేశం ముగిసింది. షర్మిల వెంట బ్రదర్ అనిల్ కూడా వెళ్లారు. తాజా రాజకీయాలపై సోనియాతో చర్చలు జరిగినట్లు సమాచారం. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని చాలా రోజుగా వస్తున్న వార్తల నేపథ్యంలో గురు వారం ఉదయం 8:30 గంటలకు సోనియాతో షర్మిల సమావేశం అయ్యారు. బ్రదర్ అనిల్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు గంటన్నరపాటు బ్రేక్ ఫాస్ట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా పార్టీ విలీనం చేస్తే తనకు ఎలాంటి హామీ వస్తుంది?.. ప్రాధాన్యం ఏంటి?.. షర్మిల సేవలను ఏ రకంగా ఎక్కువగా వాడుకుంటారన్నదానిపైనే చర్చలు జరిగినట్లు సమాచారం. తెలంగాణ లో తాజా రాజకీయాలపై చర్చలు జరిగినట్లు తెలియవచ్చింది. సోనియాతో సమావేశం ముగిసిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ గాంధీతో మంచి సమావేశం జరిగిందని, నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ బిడ్డ నిరంతరం పనిచేస్తుందని, కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని షర్మిల పేర్కొన్నారు. షర్మిల సేవలను ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణకు వాడుకుంటారా అన్నది వేచిచూడాల్సి ఉంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos