బాబా రాందేవ్ క్షమాపణలు

న్యూ ఢిల్లీ: మహిళలు దుస్తులు లేకున్నా బాగుంటారంటూ వ్యాఖ్యలెఉ చేసిన బాబా రాందేవ్ సోమవారం క్షమాపణలు చెప్పారు. మహిళలు చీరలు, సల్వార్ సూట్స్ లో చూడ చక్కగా ఉంటారని అసలు ఏం ధరించకపోయినా బాగుంటారని ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. దీంతో అనివార్యంగా రాందేవ్ బాబా క్షమాపణ చెప్పారు. ‘మహిళల సాధికారత కోసం, మహిళలు గౌరవంగా వెలుగొందడం కోసం నేను ఎల్లప్పుడూ శ్రమించే వ్యక్తిని. ఆడవారిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. నా వ్యాఖ్యలు ఎవరిపైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు చెపుతున్నా’నన్నారు.

తాజా సమాచారం