గౌరవాధ్యక్ష పదవులను వదులుకున్న కవిత

హైదరాబాద్‌: పలు సంఘాల గౌరవ అధ్యక్ష పదవులకు ఎంపీ కవిత రాజీనామా చేశారు. గౌరవ అధ్యక్ష పదవుల నుంచి తప్పుకొంటున్నట్లు ఆమె ప్రకటించారు. రాష్ట్ర బొగ్గుగని, విద్యుత్‌ కార్మిక సంఘం, అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ అసోసియేషన్‌, గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్య సంఘాల గౌరవ అధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు. సమయం కేటాయించలేకపోవడం వల్లే రాజీనమా చేస్తున్నట్లు వెల్లడించారు. రాజీనామా లేఖలను ఆయా సంఘాల ప్రధాన కార్యదర్శులకు కవిత పంపారు. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ గౌరవాధ్యక్ష పదవికి మాజీ మంత్రి హరీశ్‌రావు గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos