కాంగ్రెస్ పార్టీలో నా పాత్ర ఏంటో ఖర్గేజీని అడగండి

కాంగ్రెస్ పార్టీలో నా పాత్ర ఏంటో ఖర్గేజీని అడగండి

కర్నూలు: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన సూచనల్ని పాటించటమే తన కర్తవ్యమని పార్టీ అగ్రనేత రాహుల్ పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు.‘ కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడు వచ్చారు. ఇకపై మీరు ఏం చేయబోతున్నారన్న ప్రశ్నకు ఖర్గేజీని అడగండ’ని బదులిచ్చారు. ఇంకా ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడే పార్టీకి సుప్రీమ్. ప్రతి సభ్యుడు ఆయనకు రిపోర్ట్ చేయాల్సిందే. పార్టీలో నా పాత్ర ఏంటన్నది ఆయన నిర్ణయిస్తారు. దయచేసి ఖర్గేజీ, సోనియా గాంధీజీని అడగండి’’ అంటూ రాహుల్ బదులిచ్చారు. ఇంకా ‘‘ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ లో ఎన్నికల గురించి ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ స్వేచ్ఛా యుతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం పట్ల నేను గర్విస్తున్నాను. బీజేపీ తోపాటు ఇతర ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఎన్నికల పట్ల (అధ్యక్ష స్థానానికి) ఆసక్తి చూపించడం లేదు?’’ అని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos