ధ్యానంతో నొప్పులు మాయం!

ధ్యానంతో నొప్పులు మాయం!

రోజూ కాసేపు ధ్యానం చేస్తే ఆరోగ్యానికి మేలని చెబుతారు. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో దీనికి మరో అంశాన్ని జోడించారు. పూర్తి ఏకాగ్రతతో ధ్యానం చేస్తే దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ వివరాలను ‘ఎవిడెన్స్‌ బేస్ట్‌ మెంటల్‌ హెల్త్‌’ అనే జర్నల్‌లో ప్రచురించారు. రోజువారీ పనుల్లో భాగంగా కలిగే ఒత్తిళ్లు, నొప్పుల నుంచి కూడా బయటపడొచ్చని ఆ అధ్యయనంలో వివరించారు. ధ్యానం వల్ల మనిషి మానసికంగా చాలా ధృడంగా ఉంటారని తెలిపారు. ఫలితంగా ఆలోచనలు, ప్రవర్తనపై పూర్తిగా అదుపులో ఉంటాయని తేల్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos