నాగ్పూర్: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువ రించింది. సాయిబాబాను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. తనకు జీవిత ఖైదు విధిస్తూ విచారణ న్యాయస్థానం 2017 లో ఇచ్చిన ఉత్తర్వులను ఆయన సవాలు చేసారు. జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణజరిపి ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. శారీరక వైకల్యం కారణంగా చక్రాల కుర్చీలో ఉన్న సాయిబాబా ప్రస్తుతం నాగ్పూర్ కేంద్ర కారాగారంలో ఉన్నారు.కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ లోని వివిధ నిబంధనల ప్రకారం సాయిబాబా, ఇతరులను గతంలో కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల వినతినీ హైకోర్టు ధర్మాసనం విచారించి నిర్దోషులుగా ప్రకటించింది. వారిలో విచారణ దశలోనే మరణించారు.మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు 2017 మార్చి నెలలో సాయిబాబా, ఇతర వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది,