హైదరాబాదు: తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహిం చారు. జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్, కూకట్ పల్లి ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. ఆర్ఎస్ బ్రదర్స్ ఇటీవల ఆనర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వాసవి, సుమధర రియల్ ఎస్టేట్ సంస్థలతో కలసి ఆనర్స్ పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్టు సమాచారం. ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ పైనే కాకుండా, వాసవి, సుమ ధర సంస్థలకు చెందిన ఆస్తులు, నివాసాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టింది. మొత్తం 15 బృందాలు సోదాలు చేస్తున్నాయి.