జగన్ నా దృష్టిలో హీరో

జగన్ నా దృష్టిలో హీరో

విజయవాడ: ‘సీఎం జగన్ ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఆయన నా దృష్టిలో హీరో’ అనిఅధికార భాషా సంఘం మాజీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘… గతంలో జగన్ ను సోనియా కేంద్ర మంత్రిని చేస్తానని చెప్పినప్పటికీ, ఏం అవసరం లేదంటూ ఓదార్పు యాత్రకు వెళ్లిపోయారు. పిచ్చి కేసులో, మంచి కేసులో 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత 3,850 కి. మీ పాదయాత్ర చేసి 151 ఎమ్మెల్యేలను, 23 మంది ఎంపీలను గెలిపించుకున్నాడు. ఇది హీరోయిజం కాదా?” ఆయన చేసే పనులు కొందరికి నచ్చకపోవచ్చు. నేను అడగకుండానే అధికార భాషా సంఘం చైర్మన్ ని చేశారు. ఇప్పుడు పేరు మార్చడం అనేది మంచి సంప్రదాయం కాదని, ఒక పేరు పెట్టిన తర్వాత దాన్ని మార్చుకుంటూ వెళితే ఎక్కడ దానికి అంతం ఉంటుంది. ఇది నా మనసుకు నచ్చలేదు కాబట్టే పదవులు వదిలేస్తు న్నానని ఇంతకు ముందే స్పష్టంగా చెప్పా. నిత్యం ప్రజల మధ్యే వుండే జగన్ ను నేనెందుకు తిట్టాలి? జగన్ ను దూషించి, మరో పార్టీ వాళ్లను పొగడాలా? నేనేమీ స్వరం మార్చలేదు. రాజీనామాపై మరోమాటకు తావులేదు. పదవిలో లేనప్పటికీ తెలుగు భాష ఉన్నతికి కృషి చేస్తా. ఒక భాషా ప్రచార అభిమానిగా అంతకుముందు పదిహేనేళ్లుగా ఏం చేశానో, ఇకపైనా అదే చేస్తా. రాజకీయాలు మాట్లాడబోన’ని తేల్చి చెప్పారు.

తాజా సమాచారం