ఆటోను నడిపిన చంద్రబాబు

ఆటోను నడిపిన  చంద్రబాబు

ఏపిలో జీవితకాల పన్ను రద్దు చేసినందుకు ఆటో డ్రైవర్లు సిఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పన్ను ఎత్తివేత నిర్ణయంపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆటో డ్రైవర్లనుద్దేశించి మాట్లాడారు. తన జీవితానికి ఆటో డ్రైవర్ల జీవితానికి ఎన్నో దగ్గర పోలికలు ఉన్నాయని సిఎం చంద్రబాబు అన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని డ్రైవర్లు పోషిస్తుంటే ..రాష్ట్రాన్ని నడుపుతూ ప్రజల సంక్షేమాన్ని తాను చూస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్‌ చొక్కా ధరించి క్యాంపు ఆఫీసు ఆవరణలో స్వయంగా ఆటో నడిపి అందరిలోనూ హుషారు నింపారు. ఇంధన ఛార్జీలు, ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ఆటోవాలాలకు హామీలిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos