ఆమ్ ఆద్మీ మద్ధతు యశ్వంత్ సిన్హాకే

ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతు ప్రకటించింది. రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ శనివారం ఆ మేరకు ప్రకటించారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము అంటే మా సభ్యులందరికీ ఒక గౌరవం ఉంది . కానీ, మా మద్దతు మాత్రం యశ్వంత్ సిన్హా కే అని పేర్కొన్నారు. అంతకు ముందు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల సమితి సమావేశం జరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos