నూపుర్‌ శర్మ పోస్టు కలకలం

నూపుర్‌ శర్మ పోస్టు కలకలం

సూరత్ : మహ్మాద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపర్ శర్మ వ్యాఖ్యలు పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇక్కడి వ్యాపారి ఒకరు ఇన్స్టాగ్రామ్లో నూపుర్ శర్మ ఫొటోను పోస్టు చేశాడు. దీంతో ఆ వ్యాపారికి ఏడుగురు వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారు. ‘సూరత్లో ఉండాలనుకుంటున్నావా లేదా.. చంపేస్తా మం’టూ హెచ్చరించారు. పోలీసులకు రంగంలోకి దిగి మహ్మద్ అయాన్ అటాష్బాజివాలా, రషీద్ భురా, అలియా మహ్మద్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సూరత్ నివాసితులు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు ఉమ్రా పోలీస్ ఇన్స్పెక్టర్ జేఆర్ చౌదరి తెలిపారు. అంతకు ముందు వ్యాపారి సోషల్ మీడియా ఖాతా నుం చి నూపుర్ శర్మ ఫొటోను తొలగించి, క్షమాపణలు చెప్పాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos