రాయ్పూర్ : రైతులు, ఆవుల పెంపకందారుల నుంచి గో మూత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నికొననుంది. వచ్చే రెండు వారాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. ఇప్ప టికే ఆవు పేడను ప్రభుత్వం సేకరిస్తోంది. పాడి పరిశ్రమ ఆర్థికంగా లాభదాయకంగా మలిచేందుకు ఈ చర్యల్ని చేపట్టింది. దీని గురించి ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ సలహా దారు ప్రదీప్ శర్మ శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఆవు పేడను సేకరించినట్లుగానే గో మూత్రాన్ని కూడా రైతుల నుంచి సేకరించాలని ప్రభుత్వం గత ఫిబ్ర వరిలో నిర్ణయించింది. దీని గురించి పరిశోధనకు, సేకరణ విధాన నిర్ణయాలకు ఒక సమితిని ఏర్పాటు నియమించాం. సమితి నివేదికను సమర్పించింది. ముఖ్యమంత్రి బాఘెల్ దీనిని త్వరలోనే పరిశీలిస్తా రు. లీటరు గో మూత్రాన్ని రూ.4 చొప్పున కొనాలని ప్రతిపాదించింది. త్వరలో ఆమోదం పొందుతామని చెప్పారు. గ్రామ గోధన్ సమి తుల ద్వారా గో మూత్రాన్ని సేకరిస్తాము. రోజులకు ఒకసారి సొమ్ము చెల్లిస్తాం. హెరెలి పండుగ సందర్భంగా జూలై 28న ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. గో మూత్రంతో ఆర్గానిక్ పురుగు మందులు, ఫంగిసైడ్స్ తయారు చేయనున్నారు. గో మూత్రాన్ని కేవలం వ్యవసాయం కోసం మాత్రమే ఉపయోగిస్తారు.