తాత్కాలిక అధ్యక్షునిగా రణిల్ విక్రమసింఘే

తాత్కాలిక అధ్యక్షునిగా రణిల్ విక్రమసింఘే

కొలంబో : శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా రణిల్ విక్రమసింఘే శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గొటబయ రాజపక్స దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబేయవర్దన అధికారికంగా ప్రకటించారు. నూతన అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత రానున్న ఏడు రోజుల్లో నూతన దేశాధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు సభాపతి తెలిపారు. నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎంపీలకు అవకాశం కల్పించాలని ప్రజలకు విన్నవించారు. ఎంపీలు తమ ఆత్మప్రబోధం ప్రకారం స్వేచ్ఛగా వ్యవహరించేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలన్నారు. పార్లమెంటు సమావేశాలు శనివారం ప్రారంభమవుతాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos