న్యూ ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు చేపట్టరాదని రాజ్యసభ కార్యదర్శి జనరల్ పీసీ మోదీ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ధర్నా, ప్రదర్శన, నిరా హార దీక్ష, సమ్మె, ఏదైనా మత పరమైన వేడుక కోసం సభ్యులు పార్లమెంట్ ఆవరణను వినియోగించకో రాద’ని పేర్కొన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ సీని యర్ నేత జైరాం రమేశ్ ఖండించారు. ‘విశ్వగురు నుంచి మరో కొత్త ఆయుధం వచ్చింది. ఇక ధర్నాపై నిషేధం’ అంటూ పాసామాజిక మాధ్యమాల్లో విరుచుకు పడ్డారు.