జగిత్యాల : లోక్ సభ సభ్యుడు అరవింద్ వాహన శ్రేణిపై తెరాస కార్య కర్తలు దాడి చేశారు. కారులో ఉన్న అరవింద్‌కు చెప్పుల దండ వేసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. భారీ భద్రత నడుమ వారిని అక్కడి నుంచి పంపించి వేసారు. వరదల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగిన వాగ్వివాదం ఈ దాడికి కారణం.