ఆర్థిక జోతిష్కుడిని నియమించుకోండి

ఆర్థిక జోతిష్కుడిని నియమించుకోండి

న్యూ ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వంత నైపుణ్యాలపై ఆశలు వదులుకుని గ్రహాలను ఆశ్రయిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఎద్దేవా చేశారు. అమెరికా రోదసీ పరిశోధక సంస్థ నాసా ట్వీట్ చేసిన యురేనస్, ప్లూటో, జూపిటర్ చిత్రాలను నిర్మల సీతారామన్ మంగళవారం రీట్వీట్ చేశారు. దరిమిలా చిదంబరం గురువారం చేసిన ట్వీట్లో, ద్రవ్యోల్బణం 7.01 శాతం, నిరుద్యోగం పెరుగుదల 7.8 శాతం నమోదైన రోజు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జూపిటర్, ప్లూటో, యురేనస్ చిత్రాలను ట్వీట్ చేయడం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఆమెకు తన సొంత నైపుణ్యాలపైనా, తన ఆర్థిక సలహాదారుల నైపుణ్యాలపైనా ఆశలు అడు గంటాయని, అందుకే ఆర్థిక వ్యవస్థను కాపాడాలని గ్రహాలను పిలుస్తున్నారని హేళన చేసారు. ప్రధాన ఆర్థిక జ్యోతిష్కుడిని నియమించుకోవాలని ఎద్దేవా చేసారు. దేశ  ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కన్నా యురేనస్, ప్లూటోలపైనే ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండి పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos