గోపాలపురం: కోనసీమ జిల్లా గోపాలపురం గ్రామంలోని అన్నపూర్ణ హోటల్ ఫాస్ట్‌ఫుడ్ అందించిన పేపర్ ప్లేట్లపై రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ బొమ్మ ముద్రించడం వివా దా స్పదమైంది. ఇందుకు అభ్యంతరం తెలిపిన వారంతా వారం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. గత జులై 5 సాయంత్రం అన్నపూర్ణ హోటల్‌కు వెళ్లి నూడుల్స్ ఆర్డర్ ఇచ్చారు. వాటిని అందించిన పేపర్ ప్లేట్‌పై అంబేడ్కర్ బొమ్మ ముద్రించి ఉండడాన్ని కొందరు ఆక్షేపించారు. ఇంటికి పార్సిల్ తీసుకెళ్లిన వారికి కూడా ఆ పేపర్ ప్లేట్లు కనిపించాయి. దాంతో వారు కూడా హోటల్ వద్దకు వచ్చి హోటల్ యజమానిని ప్రశ్నించారు. పోలీసులు జోక్యం చేసుని 18 మంది ఎస్సీ యువకులను పోలీసు అరెస్ట్ చేసారు. వాళ్ల ముఖాలకు ముసుగులు వేసి రాజోలు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కాకినాడ సబ్ జైలుకి, మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. వారం పాటు జైల్లోనే గడపాక విడుదల చేసారు. హోటల్ యజమాని తమ్మనపూడి వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం నిందితులపై ఐపీసీ 120బీ, 386, 452 సెక్షన్లు కింద కేసు నమోదు చేసామని పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం ‘5వ తేదీ రాత్రి 8గం.ల ప్రాంతంలో అంబేడ్కర్ బొమ్మలున్న ప్లేట్లతో సర్వీస్ చేస్తున్నావా..నా.. అంటూ బూతులు తిడు తూ కొంతమంది హోటల్‌పై దాడి చేశారు. కొన్ని వస్తువులు ధ్వంసం చేశారు. ప్రాణ భయంతో ఫిర్యాదుదారుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత 6వ తేదీ 12.45 నిమిషాలకు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అందులో పేర్కొన్నా వారిపై కేసు నమోదు చేసి కోర్టుకి పోలీసులు వివరించారు.