ఏలూరు: పంట రుణాల జమలో అవకతవకలపై న్యాయం చేయాలంటూ జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని యూనియన్ బ్యాంకుకు రైతులు సోమవారం తాళం వేశారు. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని బ్యాంకు ఎదుట ధర్నా నిర్వ హించారు. అధికారులు వచ్చి న్యాయం చేసేవరకు ఆందోళన విరమించేది లేదని అన్నదాతలు స్పష్టం చేశారు. బ్యాంకుకు తాళాలు వేయడంతో సేవలు అందక ఖాతాదారులకు ఇబ్బందులు పడుతున్నారు.