అవును! మాది ఈడీ ప్రభుత్వమే

అవును! మాది ఈడీ ప్రభుత్వమే

ముంబై: భాజపా సర్కారు విపక్షాలపైకి ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్)ని ఉసిగొల్పుతున్నారని ఆరోపణలు వెల్లు వెత్తిన దశలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ ణవీస్ సోమవారం శాసనసభలో తమది ఈడీ ప్రభుత్వమేనన్నారు. ‘ఏక్నాథ్- దేవేంద్ర’ ప్రభుత్వంగా అభివర్ణించారు.. తమ ప్రభుత్వంలో అధికారం కోసం పోరాటాలు ఉండ వని అన్నారు. సహకారంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. “2019 ఎన్నికలకు ముందు ‘నేను తిరిగి వస్తాను’ అని నేను నినాదం ఇచ్చాను. దానిపై చాలా మంది ట్రోల్ చేశారు. ట్రోల్ చేసిన వారిని క్షమిస్తున్నా. వారిపై నేను ప్రతీకారం తీర్చుకోను. బలపరీక్ష ఓటింగ్ సమయంలో విపక్ష ఎమ్మెల్యేలు ‘ఈడీ, ఈడీ’ అని అరిచారు. అవును కొత్త ప్రభుత్వం ఈడీ ప్రభుత్వమే. ‘ఈడీ’నే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈడీ అంటే అర్థం ‘ఏక్నాథ్, దేవేంద్ర’. గత ఎన్నికల్లో మా కూటమికి ప్రజలు మెజారిటీ ఇచ్చారు. మధ్యలో దాన్ని కొంతమంది లాగేసుకున్నారు. కానీ ఏక్నాథ్ శిందేతో కలిసి మేం మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశాం. నిజమైన శివసైనికుడు సీఎం అయ్యారు. నా పార్టీ ఆదే శించ కపోతే నేను ప్రభుత్వం వెలుపలే ఉండేవాడిని. నన్ను సీఎంను చేసిన పార్టీ కోరడం వల్లే ప్రభుత్వంలో చేరాను. ఇదివరకు రాష్ట్రంలో నాయకత్వ సంక్షోభం ఉండేది. ఇకపై తాను, శిందే ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఔరంగాబాద్ పేరు మారుస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తామని చెప్పారు. గత కేబినెట్ తీసు కున్న నిర్ణయాలు మాకు ఆమోదయోగ్యమైనవే. వాటిని నిబంధనల ప్రకారం తీసుకోలేదు. అప్పటికే బలపరీక్ష చేపట్టాలని గవర్నర్ ఆదేశించారు. వాటిని మరోసారి పరిశీ లించి నిర్ణయం వెలువరిస్తాం’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos