అమరావతి: ప్రసిద్ధ బౌద్ధారామంగా పేరుగాంచిన వారసత్వ అమరావతిని శుక్రవారం శ్రీలంక కు చెందిన 80 మంది బౌద్ధులు సందర్శించారు. కొలంబోకు చెందిన గ్రీన్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఈ బృందం రెండు రోజుల క్రితం శ్రీలంక నుంచి బయలుదేరి అమరావతి చేరుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు, తెలంగాణా రాష్ట్లాలలోని బౌద్ద క్షేత్రాలను సందర్శించేందుకు పిబ్రవరి 28 వరకు పర్యటించనున్నారు. ముందుగా అమరావతిలోని ద్యానబుద్ద ప్రోజెక్టును సందర్శించారు. బౌద్ద లామాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.