నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్

నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్

చంఢిగఢ్ : నివాస గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకూ విద్యుత్ ను ఉచితంగా ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ శుక్ర వారం ప్రకటించారు. ‘గతంలో పాలించిన పార్టీలు ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయ కుండానే ఐదేళ్ల పాలనా కాలాన్ని గడిపేయడం చేసేవి. కానీ మేం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాం. పంజాబ్ చరిత్రలో కొత్త చరిత్రను లిఖిస్తున్నాం. పంజాబీలకు ఇచ్చిన మరో హామీని అమల్లోకి తెస్తున్నాం. ఈ రోజు నుంచి పంజాబ్ లోని ప్రతి కుటుంబం ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను పొందుతుంది” అని ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos